ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమపై కమిట్మెంట్తో చేస్తున్న పనితీరు ప్రత్యేకత చాటుతోంది. కూటమిలో ప్రధాన పార్టీలైన జనసేన-టిడిపిలు ఏకతాటిపై నడుస్తున్నాయని చెప్పడానికి ఈవీడియో ఓ ఉదాహరణ. చంద్రబాబు, పవన్ సంయుక్తంగా కలిసి క్యాబినేట్ సమావేశానికి వెళ్లడం, సమావేశంలో మంత్రులతో వారు చర్చిస్తున్న తీరు ఆకట్టుకుంది. మంత్రుల నుండి సలహాలు, సూచనలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మంత్రుల అభిప్రాయాలను తీసుకోవడం చంద్రబాబు సారధ్యంలో కూటమి నిజమైన ప్రజాస్వామ్య పాలనను గుర్తు చేస్తోంది.









