వైసీపీ హయాంలో చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం, ఆ నెయ్యినే లడ్డూ తయారీకి ఉపయోగించడంపై ప్రజల్లో చర్చ జరగాలని క్యాబినేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అన్నారు. క్యాబినేట్లో మొత్తం చర్చ కల్తీ నెయ్యి వ్యవహారంపైనే జరిగింది. మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న బోలే బాబా డెయిరీకి వెళ్లినా, ఎందుకు కట్టడి చేయలేదని మంత్రి పయ్యావుల అన్నారు. ఎన్డిడిబి ఇచ్చిన నివేదిక ప్రకారంగానే చంద్రబాబు మాట్లాడారని మంత్రి నాదేండ్ల అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే ప్రయత్నమే కూటమి చేస్తోందని, కల్తీ నెయ్యిని వైసీపీ సమర్థిస్తున్నట్టుగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మొత్తం వ్యవహారంపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నిజాలు తేల్చడానికి క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది.










