కాకినాడ నగరంలో హౌస్‌హోల్డ్ సర్వే నిర్వహణతో పాటు ఆస్తి పన్ను వసూలును సమాంతరంగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ వివి సత్యనారాయణ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.మంగళవారం స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నగరపాలక సంస్థకు పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిల వసూలుపై సమగ్రంగా చర్చించారు. నగరంలో మొండి బకాయిలు ఉన్న పన్నుదారుల నివాస ప్రాంతాలకు ప్రత్యక్షంగా వెళ్ళి వారిని కలవాలని అధికారులకు సూచించారు. మొండి బకాయిదారుల నుంచి పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన గడువులోగా 100 శాతం పన్ను వసూలు లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు.









