Search
Close this search box.

  పొగాపు త‌గ్గాలంటే రైతుల‌కు ప్ర‌త్యామ్నాయ పంట‌లే మార్గం – ఎంపీ ఉద‌య్ శ్రీనివాస్‌

February 3, 2026 8:50 PM | Aditya369 News

పొగాపు త‌గ్గాలంటే రైతుల‌కు ప్ర‌త్యామ్నాయ పంట‌లే మార్గం – ఎంపీ ఉద‌య్ శ్రీనివాస్‌

పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా పొగాకు సాగు చేస్తున్న రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మేరకు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో తొమ్మిది రాష్ట్రాల్లో పొగాకు పంట సాగువుతుందని, దేశవ్యాప్తంగా పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు రాష్ట్రాల సహకారంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, పొగాకు నాణ్యత, ఉత్పాదకత పెంపు, పొగాకులో హానికర పదార్థాల తొలగింపు ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ (NIRCA) ద్వారా రైతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నట్లు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు