Search
Close this search box.

  మోహ‌న్ బాబుపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాలి

February 3, 2026 8:29 PM | Aditya369 News

మోహ‌న్ బాబుపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాలి

తిరుప‌తి జిల్లాలో అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్న మోహ‌న్‌బాబుకు చెందిన యూనివ‌ర్శిటీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. అధిక ఫీజుల‌పై ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్ ను, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ ను, మోహన్ బాబు యూనివర్సిటీ కి సంబంధించిన కిరాయి గుండాలు 20 మంది తిరుప‌తి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం దుర్మార్గం అన్నారు. యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తుంటే అనేకసార్లు ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోలేదని విమర్శించారు. దీనికి కార‌ణ‌మైన మోహ‌న్ బాబుపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు.

మోహన్ బాబు యూనివర్సిటీ గూండాలు కిడ్నాప్ నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో బాలజీ చెరువు సెంటర్లో నిరసన తెలియజేసి అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కళాశాలలో జరిగే దోపిడీలను ప్రశ్నిస్తే ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ చేయడం ఎంతవరకు న్యాయం అన్నారు.విద్యాశాఖ, హోమ్ శాఖ మంత్రులు వెంటనే స్పందించి ఎస్ఎఫ్ఐ నాయకులను క్షేమంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు.మోహ‌న్‌బాబుపై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే రాష్ట్ర వ్యాప్త ఉద్య‌మాన్ని చేప‌డ‌తామ‌న్నారుఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహా కార్యదర్శి సంజయ్, కాకినాడ నగర కార్యదర్శి సత్యం, కాకినాడ నగర నాయకులు గమినివేలు, మణికంఠ, తేజశ్రీ , సాయి కిషోర్, తేజ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు