సామర్లకోట 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉన్న 11 కేవీ ఫీడర్లలో ట్రీ కటింగ్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం 08:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ వి ఎన్ డి ఎస్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఉండూరు,వీకే రాయపురం ఇండస్ట్రియల్ ఏరియా,భీమేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు,పెద్దాపురం,సామర్లకోట వాటర్ వర్క్స్‌తో పాటు కాకినాడ రోడ్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకలో అంతరాయం కలుగుతుందని వినియోగదారులు సహకరించాలన్నారు.









