Search
Close this search box.

  సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఫిర్యాదు

February 3, 2026 4:02 PM | Aditya369 News

సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు,జోగి రమేష్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) మంగళ వారం కాకినాడలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదన్నారు.సీఎం చంద్రబాబు ప్రతిష్ఠను దిగజార్చేలా చేసిన వ్యాఖ్యలపై తక్షణమే కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వీరు,శేఖర్,రవి,అనంతకుమార్,సునీత, అమన్ జైన్,సాయిబాబు,అప్పారావు,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore