Search
Close this search box.

  పిఠాపురంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

February 3, 2026 1:39 PM | Aditya369 News

పిఠాపురంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

పిఠాపురం పాదగయలో మహాశివరాత్రి ఏర్పాట్లను కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ , ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా పరిశీ లించారు. భక్తులకు తాగునీరు, క్యూలైన్లు, వంటి సౌకర్యాలపై లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ను అడిగి కార్యక్రమాల వివరాలను, ఏర్పాట్లపై చర్చించారు. విఐపి భక్తుల రాక, సామాన్య భక్తులకు ఇబ్బందులు కలకుండా దర్శనం, భక్తులు వచ్చి వెళ్లే మార్గాల వద్ద తోపులాటలు లేకుండా ఏర్పాట్లు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore