దత్తాత్రేయుని రెండవ అవతారమైన నృసింహ సరస్వతి అంతరార్ధమైన రోజును పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. మాఘ బహుళ పాడ్యమి తిథిని అనుసరించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీపాదవల్లభుడికి అభిషేకాలు నిర్వహించారు. దత్త హోమం, రుద్రహోమం జరిగాయి. ఆలయ ఈవో సౌజన్య పూజా నిర్వాహణ ఏర్పాట్లు చేశారు.










