విశాఖపట్నం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈగా పనిచేస్తు పదోన్నతిపై కాకినాడ జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈగా ఐ.సూర్యకళ నియమితులయ్యారు. కాకినాడ కార్యాలయంలో ఆమె సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ జిల్లాలో కీలకమైన పిసీబీ శాఖలో ఈఈ ఏమార్పులు తీసుకొస్తారనేది వేచి చూడాలి…తూర్పుగోదావరి జిల్లా మెప్మా పీడీగా పనిచేస్తున్న టీ.కనకరాజు కాకినాడ జిల్లా ఇన్చార్జి మెప్మా పీడీ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.










