Search
Close this search box.

  కోన‌సీమ‌లో మ‌రోసారి పైప్‌ లైన్ నుంచి గ్యాస్ లీక్

February 1, 2026 10:34 PM | Aditya369 News

కోన‌సీమ‌లో మ‌రోసారి పైప్‌ లైన్ నుంచి గ్యాస్ లీక్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామసమీపంలో ఓఎన్జీసీ పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. లీకేజ్ విషయం తెలిసిన వెంటనే ఓఎన్జీసీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీక్‌ను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. గ్యాస్ వాసనతో పరిసర గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షితంగా దూరం ఉంచుతూ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థిని స‌మీక్షిస్తున్నారు. లీకేజీ గ్యాస్ పైప్ లో నుంచి కావడంతో స్వల్ప వ్యవధిలోనే గ్యాస్ లీకేజ్ ను నియంత్రించగలిగారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ లో ఉన్న వెల్ నుంచి గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ కు అనుసంధానించిన పైప్ లైన్ నుంచే ఈ లీకేజీ గురైనట్లు ఓఎన్జీసీ నిపుణుల బృందం గుర్తించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు