ఏపీలో గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికిపై దాడిని మరవకముందే, తాజాగా విజయవాడలో మాజీ మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఇంటికి నిప్పు పెట్టారు. రాళ్లతో దాడి చేశారు. వైసీపీ ఫ్లెక్సీలను తగులబెట్టారు. ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు.దీంతో విజయవాడలోని ఇబ్రహీంపట్నం హై టెన్షన్ నెలకొంది.ఆ సమయంలో రమేశ్ ఇంట్లో లేరు. ఇంటి పై అంతస్తు నుండి మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే స్థానిక ఫైర్ సిబ్బంది అక్కడకు వెళ్లి మంటలార్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. టిడిపి శ్రేణులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని టిడిపి శ్రేణులు హెచ్చరించారు.









