Search
Close this search box.

  సినీ రంగంలో అనంత్ అద్బుతాలెన్నో

February 1, 2026 8:33 PM | Aditya369 News

సినీ రంగంలో అనంత్ అద్బుతాలెన్నో

ప్ర‌ముఖ సినీ గీత ర‌చ‌యిత అనంత శ్రీరామ్ కాకినాడ జిల్లా పిఠాపురం పాద‌గ‌య‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈసంద‌ర్భంగా డాక్ట‌ర్ అడ్డాల స‌త్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో అనంత్ శ్రీరామ్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో కుక్కుటేశ్వ‌ర‌స్వామిరాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఆయ‌న‌, పురూహూతికా శ‌క్తీపీఠంలోనూ పూజ‌లు చేశారు. ఇక్క‌డ క్షేత్రాల‌ను ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. గోదావ‌రి జిల్లాల నుండి సినీగీత ర‌చ‌యిగా వెళ్లిన అనంత్ శ్రీరామ్ అద్భుతంగా రాణిస్తున్నార‌ని అడ్డాల సత్య‌నారాయ‌ణ అన్నారు.

ఇంజనీరింగ్ చదువుతుండగా పాటలపై మక్కువ తో ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేసి, మొదటిసారిగా "కాదంటే ఔననిలే" చిత్రంలో లభించిన అవకాశంతో, ఎన్నో చిత్రాల్లో పాటలు రాసారని, ఇతను రాసిన పాటలలో ఏ మాయ చేశావె, కుర్రాడు, ఓయ్, కొత్త బంగారు లోకం, నాన్న, తదితర చిత్రాలకి పాటలు రాశారని అడ్డాల తెలిపారు. ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమాకిగాను ఉత్తమ గీత రచయిత నంది అవార్డు మరియు ఫిల్మ్ ఫేర్ కూడ వరించిందని, ఇంత వరకు 195 చిత్రాలకుపైగా 55౦ పాటలకుపైగా రాశారని అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చిందని, . సిరివెన్నల సీతారామశాస్త్రి పాటలు అంటే ఇష్టపడతారని, . 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారమందుకున్నారని తెలిపారు. శ్రీరామ్ తన కెరీర్‌లో 1000 కి పైగా తెలుగు సినిమా పాటలకు పాటలు రాశారని ,. గీత రచయితగా తన కృషికి నంది అవార్డు , రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు రెండు సైమా అవార్డులను గెలుచుకున్నారని తెలిపారు. ఈసంద‌ర్భంగా అనంత్ శ్రీరామ్‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ కార్యక్రమంలో కొర్లపాటి శ్రీకాంత్, కళ్యాణ్, పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం సిబ్బంది, పురోహితులు పాల్గొన్నారు.

ప్ర‌ముఖ సినీ గీత ర‌చ‌యిత అనంత శ్రీరామ్ కాకినాడ జిల్లా పిఠాపురం పాద‌గ‌య‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈసంద‌ర్భంగా డాక్ట‌ర్ అడ్డాల స‌త్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో అనంత్ శ్రీరామ్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో కుక్కుటేశ్వ‌ర‌స్వామిరాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఆయ‌న‌, పురూహూతికా శ‌క్తీపీఠంలోనూ పూజ‌లు చేశారు. ఇక్క‌డ క్షేత్రాల‌ను ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. గోదావ‌రి జిల్లాల నుండి సినీగీత ర‌చ‌యిగా వెళ్లిన అనంత్ శ్రీరామ్ అద్భుతంగా రాణిస్తున్నార‌ని అడ్డాల సత్య‌నారాయ‌ణ అన్నారు.

ఇంజనీరింగ్ చదువుతుండగా పాటలపై మక్కువ తో ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేసి, మొదటిసారిగా “కాదంటే ఔననిలే” చిత్రంలో లభించిన అవకాశంతో, ఎన్నో చిత్రాల్లో పాటలు రాసారని, ఇతను రాసిన పాటలలో ఏ మాయ చేశావె, కుర్రాడు, ఓయ్, కొత్త బంగారు లోకం, నాన్న, తదితర చిత్రాలకి పాటలు రాశారని అడ్డాల తెలిపారు. ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమాకిగాను ఉత్తమ గీత రచయిత నంది అవార్డు మరియు ఫిల్మ్ ఫేర్ కూడ వరించిందని, ఇంత వరకు 195 చిత్రాలకుపైగా 55౦ పాటలకుపైగా రాశారని అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చిందని, . సిరివెన్నల సీతారామశాస్త్రి పాటలు అంటే ఇష్టపడతారని, . 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారమందుకున్నారని తెలిపారు. శ్రీరామ్ తన కెరీర్‌లో 1000 కి పైగా తెలుగు సినిమా పాటలకు పాటలు రాశారని ,. గీత రచయితగా తన కృషికి నంది అవార్డు , రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు రెండు సైమా అవార్డులను గెలుచుకున్నారని తెలిపారు. ఈసంద‌ర్భంగా అనంత్ శ్రీరామ్‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ కార్యక్రమంలో కొర్లపాటి శ్రీకాంత్, కళ్యాణ్, పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం సిబ్బంది, పురోహితులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore