కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పరిపాలన మంజూరు తీసుకున్న పనులను టెండర్లకు తీసుకు రాకపోవడంపై పోడియం ముందు బైఠాయించారు. వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ కనకారావు తీరుపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. మొదట పరిపాలన మంజూరు తీసుకున్న కమిషనర్, ఇప్పుడు నిధులు లేవని, అభివృద్ధి పనులను అడ్డుకోవడం తగదన్నారు. అజెండా ప్రతులను చించి వేశారు. నల్ల బ్యాడ్జీలు కట్టుకుని చైర్మన్ పోడియం ముందే బైఠాయించి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.









