కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం చిన్న శంకర్లపూడి గ్రామానికి చెందిన రైతు మిరియాల వెంకటరాజు, రామ- లక్ష్మణ్ అనే తన కవల గిత్తలకు రెండో పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, గ్రామస్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. తన సొంత ఆవుకు కవల గిత్తలు పుట్టడం ఎంతో ఆనందంగా ఉందని రైతు వెంకటరాజు తెలిపారు.









