పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం శుక్రవారం రాత్రి కొత్తపల్లి మండలం జనసైనికులు ఆందోళనకు దిగారు. కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఎన్నికను రెండుసార్లు వాయిదా వేశారు. నిఖిల్ వర్గం అక్కడ నుండి వెళ్లిపోయింది.అయితే రాత్రి 10 గంటలకు ఖచ్చితంగా ఎన్నిక ఉంటుందని మొదట తెలిపారని అక్షయ్ వర్గం చెబుతోంది. చివరకు దానిపైనా స్పష్టత లేకపోవడంతో అక్షయ్ వర్గం ఆందోళనకు దిగింది. పోలీసులు ఆందోళనకారులను వారించారు. ఎన్నిక నిర్వహించాలని నిరసనకారులు పట్టుబట్టారు.









