77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ పోలీసు పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకులను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.కాకినాడ కలెక్టర్ కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాల్స్, వివిధ శాఖల అభివృద్ధి ప్రతిబింబించే శకటాల ప్రదర్శన ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు, జిల్లా ప్రజా పరిషత్తు, కాకినాడ ఆర్డీవో ఇతర ప్రభుత్వ కార్యాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.









