మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అనిల్, సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూనే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తన కాంబినేషన్ గురించి వస్తున్న వార్తలపై ఆసక్తికరంగా స్పందించారు.
పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడంపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను ఆయన్ని వ్యక్తిగతంగా కలవలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజల కోసం బిజీగా ఉన్నారని, అందుకే ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదని పేర్కొన్నారు. అయితే, ఒక దర్శకుడిగా ఆయనతో సినిమా చేయాలనే బలమైన కోరిక తనకు ఉందని, భవిష్యత్తులో తమ కాంబినేషన్‌లో సినిమా కుదిరితే అది కచ్చితంగా సంతోషకరమైన విషయమని అనిల్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
తన తర్వాతి ప్రాజెక్టుల గురించి చెబుతూ.. రాబోయే సినిమా 200 శాతం వినోదాత్మకంగా ఉంటుందని అనిల్ హామీ ఇచ్చారు. ప్రయోగాల కంటే ప్రేక్షకులు కోరుకునే పక్కా ఎంటర్టైన్మెంట్ మరియు కొత్త కథలకే తాను ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తన కొత్త సినిమా ఈ ఏడాది జూన్ లేదా జూలైలో సెట్స్‌పైకి వెళ్తుందని, వచ్చే సంక్రాంతికి కూడా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ








