Search
Close this search box.

  బాక్సాఫీస్ వద్ద ‘రాజు’ గర్జన: 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో నవీన్ పోలిశెట్టి!

నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. జనవరి 14న సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా, కేవలం ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించింది. పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ, కేవలం కంటెంట్‌ను నమ్ముకుని వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది. మొదటి రోజే రూ. 22 కోట్లు రాబట్టిన ఈ సినిమా, ఐదో రోజు ముగిసేసరికి రూ. 100.2 కోట్లకు చేరుకున్నట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ధృవీకరించింది.

క్లీన్ కామెడీ మరియు కుటుంబ భావోద్వేగాల కలయికగా దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం, ప్రేక్షకులకు అసలైన పండగ వినోదాన్ని అందిస్తోంది. నవీన్ పోలిశెట్టి తనదైన మేనరిజమ్స్, కామెడీ టైమింగ్‌తో సినిమాను వన్ మ్యాన్ షోగా నడిపించారని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. కేవలం స్టార్ పవర్ కంటే, బలమైన కథ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా వసూళ్లు మరోసారి నిరూపించాయి.

ఓవర్సీస్‌లో హ్యాట్రిక్ రికార్డు: కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ నవీన్ తన హవా చాటుతున్నారు. అమెరికా (US) బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. దీనితో ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత వరుసగా మూడోసారి 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన హీరోగా నవీన్ అరుదైన హ్యాట్రిక్ సాధించారు. యూఎస్ ఆడియన్స్‌లో నవీన్ పోలిశెట్టికి ఉన్న క్రేజ్ ఈ విజయంతో మరోసారి స్పష్టమైంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు