రవితేజ తన కుమారుడు మహాధన్ భూపతిరాజు కెరీర్ గురించి మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛనివ్వాలని తాను నమ్ముతానని తెలిపారు. “ఇది చేయి, అది చేయి” అని తాను ఎప్పుడూ మహాధన్‌పై ఒత్తిడి తీసుకురాలేదని, వాడు తీసుకునే నిర్ణయాలను తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం మహాధన్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర దర్శకత్వ శాఖలో (Assistant Director) పనిచేస్తున్నాడని, అక్కడ సినిమా నిర్మాణానికి సంబంధించిన మెళకువలు నేర్చుకుంటున్నాడని రవితేజ వెల్లడించారు.
ముఖ్యంగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమాకు మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కేవలం రవితేజ కుమారుడే కాకుండా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు మనోజ్ రిషి కూడా ఇదే సినిమాలో దర్శకత్వ విభాగంలో పనిచేస్తుండటం విశేషం. టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్ల వారసులు నటన వైపు కాకుండా, దర్శకత్వం వైపు అడుగులు వేస్తుండటంపై పరిశ్రమలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇక రవితేజ తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విషయానికి వస్తే.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది. రవితేజ తన మార్క్ ఎనర్జీతో నవ్వించగా, సునీల్, వెన్నెల కిషోర్, సత్యల కామెడీ ట్రాక్‌లు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్తగా రవితేజ నటన, భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ సంక్రాంతికి మాస్ మహారాజా అభిమానులకు పండగ విందును అందించాయి.









