నవీన్ పొలిశెట్టి అంటేనే స్క్రీన్ మీద ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి డీసెంట్ హిట్ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్‌తో ఈ సినిమాతో పలకరించారు. గౌరవపురం జమీందారు మనవడైన ‘రాజు’ అనే పాత్రలో నవీన్ ఒదిగిపోయారు. ఆస్తి లేకపోయినా జమీందారు అనే ట్యాగ్‌తో కోటీశ్వరి అయిన చారు (మీనాక్షి చౌదరి)ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలనే హీరో ప్రయత్నాలు, ఆ క్రమంలో వచ్చే వినోదం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
సినిమా ప్రథమార్థం మొత్తం నవీన్ తన కామెడీ టైమింగ్‌తో పరుగులెత్తించాడు. ‘ఆపరేషన్ చారు’ పేరిట హీరోయిన్‌ను బుట్టలో వేసేందుకు చేసే ప్రయత్నాలు, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. ముఖ్యంగా పెద్దిపాలెం బీచ్‌ను గోవాగా మార్చే సీక్వెన్స్, పారా గ్లైడింగ్ సీన్లు థియేటర్లో నవ్వుల జల్లు కురిపించాయి. ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్ కథను మలుపు తిప్పడమే కాకుండా సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచింది.
ద్వితీయార్థంలో ప్రెసిడెంట్ ఎన్నికల చుట్టూ తిరిగే కథలో కూడా ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ తగ్గలేదు. మీనాక్షి చౌదరి తన గ్లామర్‌తో, నటనతో మెప్పించగా.. రావు రమేష్ మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే చిన్న ఎమోషనల్ టర్న్ సినిమాకు కాస్త బరువును జోడించినా, చివరికి మళ్ళీ నవ్వులతోనే ముగించడం ప్రేక్షకులకు హాయినిస్తుంది. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో ఈ సంక్రాంతికి ఒక పక్కా ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.








