విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ (Kingdom). ఈ సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందని హింట్ ఇవ్వడంతో పార్ట్-2 కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ‘కింగ్డమ్’ సీక్వెల్ చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేయడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ విజయ్ నటనకు, యాక్షన్ సీక్వెన్స్‌లకు మంచి స్పందన లభించింది. సీక్వెల్ ఆగిపోయిందనే వార్తలపై స్పందిస్తూ.. “ప్రస్తుతానికి కింగ్డమ్ పార్ట్-2 ఆలోచన లేదు. అయితే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో మా బ్యానర్లో మరో సినిమా ఉంటుంది. ఆయన ప్రస్తుతం వేరే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు, అది పూర్తయ్యాక మా సినిమా మొదలవుతుంది” అని నాగవంశీ వివరించారు. దీనితో విజయ్ – గౌతమ్ కలయికలో సినిమా ఉన్నప్పటికీ అది ‘కింగ్డమ్’ సీక్వెల్ మాత్రం కాదని తేలిపోయింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం ‘రౌడీ జనార్ధన’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ మాస్ లుక్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘కింగ్డమ్’ నిరాశపరిచినప్పటికీ, ‘రౌడీ జనార్ధన’తో విజయ్ మళ్లీ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.









