Search
Close this search box.

  వాళ్ల పేర్లు చెబితే షాకవుతారు: ఇండస్ట్రీపై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు

December 20, 2025 5:15 PM | Aditya369 News

వాళ్ల పేర్లు చెబితే షాకవుతారు: ఇండస్ట్రీపై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు

నటి రాధికా ఆప్టే సినీ పరిశ్రమలో తన 20 ఏళ్ల ప్రయాణంపై మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణాది చిత్రాల్లో కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లే నటించాల్సి వచ్చిందని, ఆ సమయంలో కొన్ని భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నానని ఆమె పేర్కొన్నారు. ఒక సందర్భంలో షూటింగ్ సెట్‌లో నేనొక్కదాన్నే మహిళను ఉండేదాన్ని అని, మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తన సొంత సిబ్బందిని కూడా అనుమతించేవారు కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో మహిళల గురించి అసభ్యకరమైన జోకులు వేస్తూ తనను తీవ్ర అసౌకర్యానికి గురిచేశారని ఆమె వివరించారు.
దక్షిణాది సినిమాల సెట్స్‌లో ఎదురైన వివక్షను గుర్తుచేసుకుంటూ.. "వారు నా శరీరంపై బమ్స్ మరియు బ్రెస్ట్ వద్ద మరిన్ని ప్యాడింగ్స్ వేయమని అడిగేవారు. ‘అమ్మా.. మోర్ ప్యాడింగ్!’ అంటూ వారు అడిగే తీరు నన్ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసేది" అని రాధికా వెల్లడించారు. సాధారణంగా తాను చాలా ధైర్యవంతురాలినని, కానీ ఆ రోజుల గురించి తలుచుకుంటే ఇప్పటికీ తన గుండె వేగంగా కొట్టుకుంటుందని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఏ నటికీ ఇలాంటి పరిస్థితులు రాకూడదని, అప్పట్లో తాను అనుభవించినవి నిజంగా ఒక 'ట్రామా' (Trauma) అని ఆమె పేర్కొన్నారు.
బాలీవుడ్‌లోనూ తనకు కొన్ని చేదు అనుభవాలు ఎదురైనట్లు రాధికా చెప్పారు. పరిశ్రమలో చాలా గొప్ప పేరున్న వ్యక్తులను కొన్ని ఆఫర్ల కోసం కలిశానని, కానీ వారి నిజస్వరూపాలు చూశాక మళ్లీ జీవితంలో వారిని కలవకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. "వాళ్ల పేర్లు బయటపెడితే మీరు కచ్చితంగా షాకవుతారు" అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 2005లో ‘వా! లైఫ్ హో తో ఐసీ’ చిత్రంతో అరంగేట్రం చేసిన రాధికా ఆప్టే.. తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘ధోని’, ‘లెజెండ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

నటి రాధికా ఆప్టే సినీ పరిశ్రమలో తన 20 ఏళ్ల ప్రయాణంపై మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణాది చిత్రాల్లో కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లే నటించాల్సి వచ్చిందని, ఆ సమయంలో కొన్ని భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నానని ఆమె పేర్కొన్నారు. ఒక సందర్భంలో షూటింగ్ సెట్‌లో నేనొక్కదాన్నే మహిళను ఉండేదాన్ని అని, మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తన సొంత సిబ్బందిని కూడా అనుమతించేవారు కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో మహిళల గురించి అసభ్యకరమైన జోకులు వేస్తూ తనను తీవ్ర అసౌకర్యానికి గురిచేశారని ఆమె వివరించారు.

దక్షిణాది సినిమాల సెట్స్‌లో ఎదురైన వివక్షను గుర్తుచేసుకుంటూ.. “వారు నా శరీరంపై బమ్స్ మరియు బ్రెస్ట్ వద్ద మరిన్ని ప్యాడింగ్స్ వేయమని అడిగేవారు. ‘అమ్మా.. మోర్ ప్యాడింగ్!’ అంటూ వారు అడిగే తీరు నన్ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసేది” అని రాధికా వెల్లడించారు. సాధారణంగా తాను చాలా ధైర్యవంతురాలినని, కానీ ఆ రోజుల గురించి తలుచుకుంటే ఇప్పటికీ తన గుండె వేగంగా కొట్టుకుంటుందని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఏ నటికీ ఇలాంటి పరిస్థితులు రాకూడదని, అప్పట్లో తాను అనుభవించినవి నిజంగా ఒక ‘ట్రామా’ (Trauma) అని ఆమె పేర్కొన్నారు.

బాలీవుడ్‌లోనూ తనకు కొన్ని చేదు అనుభవాలు ఎదురైనట్లు రాధికా చెప్పారు. పరిశ్రమలో చాలా గొప్ప పేరున్న వ్యక్తులను కొన్ని ఆఫర్ల కోసం కలిశానని, కానీ వారి నిజస్వరూపాలు చూశాక మళ్లీ జీవితంలో వారిని కలవకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. “వాళ్ల పేర్లు బయటపెడితే మీరు కచ్చితంగా షాకవుతారు” అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 2005లో ‘వా! లైఫ్ హో తో ఐసీ’ చిత్రంతో అరంగేట్రం చేసిన రాధికా ఆప్టే.. తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘ధోని’, ‘లెజెండ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు