కాకినాడ జిల్లా పిఠాపురంలో అర్ధరాత్రి మహిళపై కత్తులతో దుండగులుదాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
ఆసుపత్రి నుండి విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న మహిళను దుండగులు వెంబడించి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
పిఠాపురం సీతయ్య గారితోట శివారు నరసింగపురం రోడ్డులో ఈ ఘటన జరిగింది. పిఠాపురం-సామర్లకోట రోడ్డు లో ఓ ప్రవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నఅల్లం సునీత రాత్రి విధులు ముగించుకుని హైవే మార్గం నుండి స్కూటీ పై ఇంటికి బయలుదేరింది. ఆమె సీతయ్య గారి తోట మీదుగా వస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెంబడించి కత్తులతో దాడి చేసినట్టు చెబుతున్నారు. దాడిలో సునీత శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యయి.
గాయపడ్డ సునీత గట్టిగా అరవడంతో దుండగులు పరారయ్యారు. ఈ దాడిలో సునీత గాయాలతో స్పృహ తప్పి రోడ్డుపైనే పడిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు రక్తపు గాయాలతో ఉన్న సునీతను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. దుండగులు మహిళను వెంబడించి దాడి చేయడం పై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు








