Search
Close this search box.

  ‘అఖండ 2’కి దీటుగా రోషన్ ‘మోగ్లీ 2025’ విడుదల

నందమూరి బాలకృష్ణ నటించిన భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఆ తేదీకి రిలీజ్ ప్లాన్ చేసుకున్న అనేక చిన్న సినిమాలు వాయిదా పడుతున్నాయి. అయితే, యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా, సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోగ్లీ 2025’ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అందరూ వాయిదా పడుతుందని అనుకున్నా, నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం ‘అఖండ 2’ రిలీజైన కొద్ది గంటల తర్వాత, అంటే డిసెంబర్ 12 రాత్రే ప్రీమియర్ షోలతో పోటీకి సిద్ధమయ్యారు.

నిజానికి, ‘అఖండ 2’ విడుదల తేదీ ప్రకటించగానే, ‘మోగ్లీ 2025’ వాయిదా పడుతుందనే వార్తలు బలంగా వినిపించాయి. దర్శకుడు సందీప్ రాజ్ కూడా “బ్యాడ్ లక్” అంటూ ట్వీట్ చేయడంతో సినిమా పోస్ట్ పోన్ అయినట్లే అని అంతా భావించారు. డిసెంబర్ 19 లేదా 24కి లేదంటే ఏకంగా ఫిబ్రవరి లేదా మార్చికి షిఫ్ట్ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా నడిచింది. అయితే, చివరికి మేకర్స్ అనూహ్యంగా ముందుగా ప్రకటించిన డిసెంబర్ 12న ప్రీమియర్ షోలు, 13న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యకరం.

ఈ నిర్ణయంతో, మిగతా చిన్న సినిమాలన్నీ బాలయ్య సినిమాకు భయపడి వాయిదా వేసుకుంటుంటే, ‘మోగ్లీ 2025’ మాత్రం పోటీగా బరిలోకి దిగుతోంది. అయితే, డైరెక్టర్ సందీప్ రాజ్ చేసిన ఆవేదన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొందరు నెటిజన్లు సానుభూతి కోసమే అలా ట్వీట్ చేశారని ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన సందీప్ రాజ్, తాను సానుభూతి కోసం ట్వీట్ చేయలేదని, సినిమాను ఫిబ్రవరి – ఏప్రిల్‌కు షిఫ్ట్ చేసే చర్చల నేపథ్యంలో ఎమోషనల్ అయ్యానని వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ‘అఖండ 2’పై తనకు అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు