పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో అంబేడ్కర్ 69వ వర్థంతి వేడుకను నిర్వహించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వర్మ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మహానీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. చదువు విలువ తెలిసిన గొప్పవ్యక్తని అన్నారు. ఈనాడు భారతదేశం మొత్తం అంబేడ్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా నడుస్తోందన్నారు. ఆయనను ప్రతీ విద్యార్థి స్పూర్తిగా తీసుకోవాలని వర్మ అన్నారు.








