పిఠాపురం జనసేన ఇన్చార్జి మార్పు వ్యవహారంపై గత కొంతకాలంగా జిల్లా రాజకీయాలలో తీవ్ర చర్చలు నడిచాయి. ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మర్రెడ్డి శ్రీనివాస్ తీరుపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఆ చర్చలన్నింటికీ అడ్డుకట్టుగా పవన్ కళ్యాణ్ ఇన్చార్జి వ్యవస్థకు ప్రత్యామ్నయంగా రెండు నెలల క్రితం అందుబాటులోకి ఐదుగురు సభ్యుల కమిటీని తీసుకువచ్చారు. ఐదుగురు సభ్యుల కమిటీలో నుండి కూడా మర్రెడ్డి శ్రీనివాస్ ను ఇప్పుడు తొలగించి నట్లుగా తెలుస్తుంది. దీనిపై జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు స్పష్టత ఇచ్చారు.మర్రెడ్డి శ్రీనివాస్ కు అనపర్తి నియోజకవర్గం పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. దీంతో పిఠాపురంలో మర్రెడ్డికి ఇన్చార్జిగా గాని కమిటీలో గాని ఎలాంటి బాధ్యతలు ఉండవని స్పష్టం చేశారు.జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇక నుండి ఐదుగురు సభ్యుల సమన్వయ కమిటీలోకి నూతనంగా ఓదూరి కిషోర్ ను తీసుకున్నట్లు తుమ్మల బాబు వెల్లడించారు.
అయితే నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను కట్టడి చేసేందుకు పవన్ కళ్యాణ్ కార్యచరణ చేస్తున్నట్లు తెలుస్తుంది. గ్రూపు రాజకీయాల మూలంగా పిఠాపురంలో జనసేన పై తీవ్ర ప్రభావం పడుతుందని పవన్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం వాటిని నియంత్రించేందుకుగాను పవన్ కళ్యాణ్ త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అయితే ఐదుగురు సభ్యులు కమిటీని ఒకే తాటిపైకి తేవడంలో పవన్ కళ్యాణ్ సఫలమవుతారా విఫలమవుతారో ముందులో జరిగిన తప్పిదాలను మరల పునరావృతం కాకుండా చూసుకుంటారా?అన్నది వేచి చూడాలి మరి.









