పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో జనసేనలో ఓ వార్త చక్కెర్లు కొడుతుంది. పిఠాపురం జనసేన ఇన్చార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ ను ఫైవ్ మాన్ కమిటీ నుండి తప్పించారని ప్రచారం జరుగుతుంది. కొంతకాలం కిందట పవన్ కళ్యాణ్ స్వయంగా ఫైమన్ కమిటీని ప్రకటించారు. అందులో మర్రెడ్డి శ్రీనివాస్ కూడా ఉంటారని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆయనను పై మాన్ కమిటీ నుండి తప్పించారని అంటున్నారు. అదే స్థానంలో చేబ్రోలు పవన్ కళ్యాణ్ కార్యాలయం ఓనర్ ఓదూరి కిషోర్ కు అవకాశం దక్కిందని ప్రచారం కూడా ఉంది. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది









