పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అదోక వెపన్‌లాగే వినిపించే పేరు. ప్రభుత్వానికి అండగా పవన్ ఓ వెపన్‌లా పనిచేస్తున్నప్పటికీ, ఆ వెపన్ ఎప్పుడు ఏలా..ఎందుకు..ఏమి చేస్తుందో కూడా ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. అసలు పవన్ కంటూ ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ ఉందా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి ఎంతో సపోర్టుగా ఉంటున్న పవన్ కొత్త వ్యూహానికి తెరలేపారా..ఆయనకు పిఠాపురంలో అంత భూమి ఎందుకు..? ఆ భూమిలో ఆయన ఏం చేస్తారు..అంటే అదీ కూడా చిక్కు ప్రశ్నే. పవన్‌కు పవర్ ఫుల్ ల్యాండ్ పిఠాపురం కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది .

పిఠాపురం హైవే అడ్డాగా పవన్ తన కార్యకలపాలను నిర్వహించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా మరికొందరు చెబుతున్నారు. తాజాగా మరో 2.63 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేయడం పవన్ పిఠాపురం నుండే ఫ్యూచర్ ప్లాన్‌పై చర్చకు తెరలేపారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఆయన సడన్‌గా ఎందుకు అలా చేస్తున్నారో ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. రాష్ట్ర డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు ప్రణాళికను పిఠాపురం నుండే సిద్ధం చేసుకుంటున్నారా..అంటే అందుకు ఆయన వేస్తున్న అడుగులే సమాధానం చెబుతున్నాయి. పవన్ ఈ ఏడాది తాజాగా నవంబర్ 13వ తేదిన ఆయన పిఠాపురంలో ఎల్‌పి. నెం 100, 105, 211 లో 2.63 ఎకరాల భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందుకు ఆయన తరుపున సివిల్ సప్లై ఛైర్మన్ తోట సుధీర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 216 జాతీయ రహదారికి ఆనుకుని ఇలింద్రాడ రెవెన్యూ పరిధిలో తూర్పు, ఈశాన్య స్థలాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. గొల్లప్రోలుకు చెందిన జలిగంపల కమల నుండి ఈభూమిని కొనుగోలు చేశారు.త్వరలో మరో ఇద్దరి రైతుల భూమి కూడా పవన్ సొంతం చేసుకోనున్నారని సమాచారం. భారీ మొత్తంలోనే వెచ్చించి ఈభూమిని పవన్ దక్కించుకుంటున్నారని చెబుతున్నారు. నెలాఖరునాటికి సుమారు 5 ఎకరాల భూమి పవన్ సొంతం అవుతుందని, ఇప్పటికే దానికి సంబంధించిన చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో 18.. ఇప్పుడు 2.63.. త్వరలో మరో 2 ఎకరాలకుపైగా
పిఠాపురం216 జాతీయ రహదారి టోల్‌ప్లాజా సమీపంలో గతంలో 18 ఎకరాలకు పైగా భూమిని పవన్ కొనుగోలు చేశారు. తాజాగా ఆ భూమికి ఆనుకుని ఉన్న 2.63 ఎకరాల భూమిని పవన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ తతంగం పూర్తి చేశారు. ఈనెలాఖరు నాటికి మరో రెండు ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన భూమిలోనే జనసేన పార్టీ కార్యాలయంతోపాటు, గెస్ట్‌హౌస్ కూడా కడతారని అంటున్నారు.

మరో రెండు మూడు నెలల్లో ఈపనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. పవన్ పిఠాపురం కేంద్రంగా పవన్ ఫ్యూచర్ ప్లాన్‌కు అడుగులు వేస్తున్నారని జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పవన్ తాను పిఠాపురంలోనే స్థిర పడతానని చెప్పడానికి ఈ ప్రక్రియ మొదలు పెట్టారా..లేక ఆయన సొంత ప్రయోజనాలకా అనేది మాత్రం చిక్కు ప్రశ్నగానే మిగిలింది. త్వరలో దీనిపై జనసేనాని ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.










