ఈ చిత్రంలో కనిపిస్తున్న ముగ్గురులో ఇద్దరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్. వీరిలో ఒకరు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ,కాకినాడ జిల్లాకు తుఫాన్ ప్రత్యేక అధికారి.మరొకరు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఇంకొకరు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్. ప్రస్తుతం మొంథా తుఫాన్‌పై జిల్లాలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యవేక్షణలో వీరు ముగ్గరు నిమగ్నమయ్యారు. కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డులో జోరు వాన కురుస్తున్న సమయంలో వీరు ముగ్గరు ఒకే గొడుగు కింద ఉండి తుఫాన్ ప్రభావంపై చర్చించుకోవడం అధికారుల ఐకత్యకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఒకే మాటగా..ఒకే బాటగా ప్రజలకు సేవ చేయడంలో అధికారుల ఐక్యతకు తార్కాణంగా ఈ చిత్రం కనిపిస్తోంది.









