ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అంటేనే అదొక సెన్షేషన్‌గా మారుతోంది. పవన్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి పవన్ పర్యటన అంటే ఆధ్యంతం ఆసక్తి రేపోతోంది. అంతకముందు ఎన్నికల సమయంలోనూ ఆయన పర్యటన ఎప్పుడెప్పుడా అని జనసైనికులు, పిఠాపురం ప్రజలు ఎదురుచూసేవారు. సినీ హిరోని చూడాలని కొందరుంటే, తమ నాయకుడ్ని చూసి ఆనందించాలనే ఆశ కార్యకర్తల్లో ఉండేది. పవన్ పర్యటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేవారు. జనసేనలో ఆ జోష్ ఉండేది. కానీ ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, మూడు ప్రధాన మంత్రిత్వశాఖల బాధ్యతలను పవన్ నిర్వర్తిస్తున్నారు.
నిత్యం బిజీ షెడ్యూల్‌గానే పవన్ షెడ్యూల్ సాగిపోతుంది. పవన్ పర్యటన అంటే బందోబస్తు, ఏర్పాట్లు అదంతా అధికారులకు ఓ ప్రహసనమనే చెప్పాలి. గతంలో ఆయన పిఠాపురంలో పర్యటించాలని పలుమార్లు అనుకున్నప్పటికీ వాయిదాలు పడుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఉప్పాడలో మత్స్యకారులు కాలుష్య కారకాల వల్ల తాము జీవనోపాధి కోల్పోతున్నామని, ఆందోళనతో ఆయన రాక తప్పలేదు. ఉప్పాడలో భారీ సభను పవన్ నిర్వహించి సమస్యా పరిష్కారినికి 100 రోజుల సమయం అడిగారు. పైగా అదే సభలో మరోసారి తాను కొద్దిరోజుల్లోనే తీర ప్రాంతం మొత్తం పర్యటిస్తానని బహిరంగంగానే చెప్పారు. ఆ తర్వాత పవన్ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది ఇప్పటికీ స్పష్టత లేదు. ఇటీవల పవన్ రాజోలు పర్యటన కూడా వాయిదా పడింది.
తాజా కాకినాడకు మొంథా తుఫాన్ ఎఫెక్ట్(mentha toofan) ప్రభావంతో ఇక్కడ ప్రాంతవాసులను అలర్ట్ చేయడానికి, అధికార యంత్రాంగాన్ని మోనిటరింగ్ చేయడానికి పవన్ వస్తానని అన్నారట. అయితే కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రస్తుత పరిస్థితుల్లో అధికార యంత్రాంగం మొత్తం తుఫాన్ నష్టనివారణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పవన్ రాక జరిగితే అధికార యంత్రాంగా పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది..అని కలెక్టర్ సున్నితంగా పవన్‌కు చెప్పారట. దీంతో పవన్ కాకినాడ పర్యటన మరోసారి వాయిదా పడింది. తుఫాన్ ఎఫెక్ట్ వల్లే పవన్ రాలేని పరిస్థితి అని జనసైనికులు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి పవన్ రావాలని అనుకున్నప్పటికీ ఆయనకు పరిస్థితులు అనుకూలించకపోవడం పెద్ద సమస్యగా మారిందనే చెప్పాలి.









