న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దసరాని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు మరోసారి నానితో కలిసి ది ప్యారడైజ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో విలన్‌గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. మంచు లక్ష్మీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించడంతో ఆ టాక్ వైరల్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం, మోహన్ బాబు విలన్ పాత్రలో కాకుండా, గురువు పాత్రలో కనిపించనున్నారు. హీరో ప్రయాణానికి ప్రేరణనిచ్చే కీలకమైన రోల్ ఆయనదే అని చెబుతున్నారు.
నాని ఈ సినిమాలో జడల్ అనే కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో ఆయన లుక్ పూర్తిగా భిన్నంగా ఉండి, అభిమానుల్లో ఆసక్తిని రేపింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో వేగంగా సాగుతోంది.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. దీంతో ది ప్యారడైజ్పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి..









