Search
Close this search box.

  ఎడారిలో అల్లు అర్జున్ యాక్షన్ సీన్స్..! అట్లీ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా..?

‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా… ఇంటర్నేషనల్!’ అన్న అల్లు అర్జున్ డైలాగ్ అక్షరాలా నిజమైంది. పుష్ప 2 ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓటీటీలో విడుదలైన తర్వాత సబ్‌టైటిల్స్‌తో సినిమా చూసిన విదేశీ ప్రేక్షకులు కూడా బన్నీకి అభిమానులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాహుబలి 2 తర్వాత అత్యధిక కలెక్షన్లు అందుకున్న రెండో తెలుగు చిత్రంగా నిలిచింది.

ఈ విజయానంతరం బన్నీ, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి AA22xA6 పేరుతో ఒక భారీ సినిమాను ప్రారంభించాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ దాదాపు రూ.800 కోట్లు. ఇప్పటికే 50 రోజుల షూటింగ్ పూర్తవ్వగా, పుష్ప 2, జవాన్ విజయాలతో బన్నీ – అట్లీ ఇద్దరూ వెయ్యి కోట్ల క్లబ్‌లో నిలిచిన తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ పనులు అవసరమవుతున్నాయి. అందుకే హాలీవుడ్ టెక్నీషియన్లతో కలిసి ప్రత్యేక టీమ్ అమెరికాలో పనిచేస్తోంది. ముంబయిలో జరిగిన షెడ్యూల్ అనంతరం, అక్టోబర్‌లో అబుదాబి లివా ఒయాసిస్ ఎడారిలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఇందులో అల్లు అర్జున్‌పై గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఈ షెడ్యూల్‌లో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్‌లతో పాటు మరో హీరోయిన్ కూడా పాల్గొననుందని టాక్. ఇక కథలో సమాంతర ప్రపంచం, సైన్స్ ఫిక్షన్ అంశాలతో పాటు, అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రష్మిక మందానా, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా, మేకర్స్ మాత్రం అధికారికంగా ఏమీ వెల్లడించలేదు.

బన్నీ ఈ ప్రాజెక్ట్ కోసం భారీ రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడని టాక్. మొత్తానికి, సౌత్ సినిమాను మళ్లీ ప్రపంచస్థాయిలో నిలబెట్టేలా అట్లీ – అల్లు అర్జున్ కాంబో గట్టి ప్లాన్ వేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు