యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – మాస్ యాక్షన్ సినిమాల మాస్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ స్టార్ రుక్మిణి వసంత్ నటిస్తున్నారని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తాజాగా అధికారికంగా ధృవీకరించారు.
‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రుక్మిణి, ఆ విజయానంతరం వరుస ఆఫర్లతో బిజీగా మారారు. ఆ జాబితాలో ఇప్పుడు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా కూడా చేరింది.
తాజాగా శివకార్తికేయన్ – ఏఆర్ మురుగదాస్ కాంబోలో రూపొందుతున్న ‘మదరాసి’ ఈవెంట్‌లో పాల్గొన్న ఎన్వీ ప్రసాద్, రుక్మిణి ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమని స్పష్టంగా ప్రకటించడంతో, ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుతున్నారు.
ప్రస్తుతం ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో కొనసాగుతున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే, ఈ మాస్ యాక్షన్ ప్యాక్డ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌ను 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు..









