మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్ సోషియో ఫాంటాషి సినిమా ‘విశ్వంభర’. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనుకోని కారణాల వలన షూటింగ్ డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ ను ఇటీవల ఫినిష్ చేసారు.
కాగా ఈ సినిమాకు సంబందించి కీలకమైన అప్డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరు. ఆ వీడియోలో చిరు మాట్లాడుతూ ‘ ఎప్పుడో విడుదల కావాల్సిన విశ్వంభర విఎఫెక్స్ వర్క్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా సెకండాఫ్ మొత్తం విఎఫెక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. క్వాలిటీలో ఎక్కడ కంప్రమైజ్ కాకూడదని, మీ అందరికి మంచి సినిమా ఇవ్వాలని తీవ్రంగా కష్టపడుతోంది టీమ్. అందుకే రిలీజ్ వాయిదా పడుతుంది. ఇక విశ్వంభర కథ విషయానికి వస్తే ఈ సినిమా ఒక చందమామ లాంటి కథ. చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. కానీ మీ అందరికి సర్ప్రైజ్ లాగా నా బర్త్ డే కానుకగా ఈ రోజు సాయంత్రం 6.06 నిమిషాలకు చిత్ర నిర్మాతలైనా UV క్రియేషన్స్ విశ్వంభర గ్లిమ్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది నేను లీక్ చేస్తున్నాను. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా విశ్వంభర మీ ముందుకు వస్తుంది. విశ్వంభరను ఆశీర్వదించండి’ అని అన్నారు.