రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హారర్, కామెడీ, రొమాంటిక్ టచ్‌లతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్‌గా కనిపించనుండగా, సంగీతాన్ని ఎస్.ఎస్. థమన్ అందిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్’ కి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది..రిలీజ్ డేట్ విషయంలో మాత్రం గత కొన్ని రోజులుగా గందరగోళం కొనసాగుతోంది. మొదటగా డిసెంబర్ 5 రిలీజ్ అని అధికారికంగా ప్రకటించినా, ఓటీటీ డీల్ ఫైనల్ కాకపోవడంతో వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా, ప్రముఖ థియేటర్ చైన్ PVR INOX తమ బుకింగ్ యాప్‌లో ఈ సినిమాను 2026 జనవరి 9 రిలీజ్‌గా చూపించింది..అలాగే, ఇటీవల నిర్మాత విశ్వ ప్రసాద్ కూడా ఒక ఇంటర్వ్యూలో, “సౌత్ డిస్ట్రిబ్యూటర్లు సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయమని కోరుతున్నారు. దానిపై మేము ఆలోచిస్తున్నాం” అని వెల్లడించారు. ఈ పరిణామాలతో ‘ది రాజా సాబ్’ జనవరి 9నే థియేటర్లలో సందడి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి..
