Search
Close this search box.

  జవాన్ మురళి నాయక్ బయోపిక్..! హీరో ఎవరంటే..?

సత్యసాయి జిల్లా కల్లి తాండకు చెందిన మురళి నాయక్ చిన్ననాటి నుంచే దేశభక్తి మంత్రంలో మునిగి ఇండియన్ ఆర్మీలో చేరారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ లో శత్రువులపై పోరాడుతూ ఆయన వీరమరణం పొందారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ యోధుని త్యాగం అందరినీ కదిలించింది. తల్లిదండ్రులకు ఏకైక సంతానమైన మురళి నాయక్, తన చివరి శ్వాసను భారతమాత ఒడిలోనే విడిచారు..ఈ వీరుడి త్యాగం అందరికీ స్ఫూర్తి కావాలని భావించి ఆయన జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రూపొందించబోతున్నారు. కే. సురేష్ బాబు ప్రొడక్షన్ లో, బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ మురళి నాయక్ పాత్రను పోషిస్తున్నారు..గౌతమ్ మాట్లాడుతూ – ఇప్పటివరకు బయోపిక్‌లు ఎక్కువగా మేజర్, కల్నల్ స్థాయిలో ఉన్న ఆఫీసర్ల గురించి మాత్రమే వచ్చాయి. కానీ ఒక సాధారణ జవాన్ జీవితాన్ని ప్రతిబింబించే సినిమా మాత్రం ఇదే మొదటిసారి అని అన్నారు..మురళి నాయక్ కుటుంబంతో గౌతమ్ కృష్ణ మాట్లాడినప్పుడు, వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆయన తల్లి, “నా కొడుకు బయోపిక్‌లో నువ్వే నటిస్తానంటేనే నేను ఒప్పుకుంటాను” అని చెప్పి ఆశీర్వదించారు.ఇక గౌతమ్ కృష్ణ గతంలో తన సినిమా సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ సమయంలో మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసి తన అండగా నిలిచిన సంగతి తెలిసిందే…ఈ బయోపిక్‌ను కేవలం తెలుగులోనే కాకుండా, అన్ని భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని గౌతమ్ కృష్ణ వెల్లడించారు…దేశం కోసం బలి అయిన ఈ జవాన్ కథ, వెండితెరపై ప్రతీ భారతీయుడి హృదయాన్ని తాకనుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు