టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఆ తరువాత వచ్చిన ‘దేవర’ మొదట మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా, ఆ తర్వాత కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. కథ పెద్దగా బలంగా లేకపోయినా, ఎన్టీఆర్ శక్తివంతమైన నటన, డాన్స్, అలాగే అనిరుధ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా హిట్‌కి ప్రధాన కారణమయ్యాయి..
‘దేవర 2’ను అధికారికంగా ప్రకటించినప్పటికీ, కథలో అంతగా స్కోప్ లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తాజాగా సోషల్ మీడియాలో “దేవర 2 ఆగిపోయింది” అనే వార్తలు వైరల్ అయ్యాయి. ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో, అదే పరిస్థితి రాకముందే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను ఆపేశారనే టాక్ కూడా బయటకు వచ్చింది. దీంతో డైరెక్టర్ కొరటాల శివ, నాగచైతన్యతో కొత్త సినిమా చేయబోతున్నారని వార్తలు హల్‌చల్ చేశాయి.
అయితే ఈ రూమర్స్ అన్నింటినీ కొట్టి పారేస్తూ మేకర్స్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. “దేవర 2 ఎప్పటికీ ఆగిపోలేదు” అని స్పష్టంగా చెబుతూ, స్క్రిప్ట్ వర్క్, డైలాగ్ వెర్షన్ పూర్తయ్యాయని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సీక్వెల్‌కి పెద్ద హైప్ లేకపోయినా, షూటింగ్ మొదలైన తర్వాత అంచనాలు రెట్టింపు అవుతాయని నమ్ముతున్నారు..
మేకర్స్ ప్రకారం, ఇది బాహుబలి 2, పుష్ప 2, సలార్ 2, కేజీఎఫ్ 2 రేంజ్ కాకపోయినా, సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. మొత్తానికి, దేవర 2పై ఊహించని క్రేజ్ మళ్లీ క్రియేట్ చేశారు.ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ప్రారంభమైంది..