గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పెద్ది” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తవగా, ఈ సినిమాలో చరణ్ విభిన్న లుక్స్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ప్రస్తుతం టీమ్ సెకండ్ లుక్ పోస్టర్ వర్క్‌లో బిజీగా ఉండగా, త్వరలోనే దాన్ని రిలీజ్ చేయనున్నారు.. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక ఫోక్ సాంగ్ హైలైట్ కానుంది. దానికి ఏ.ఆర్. రెహమాన్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా వచ్చిందని సమాచారం. ఈ పాటకు జానీ మాస్టర్ ఎనర్జీటిక్ కోరియోగ్రఫీ అందించనున్నారు. వచ్చే షెడ్యూల్‌లో ఈ పాట చిత్రీకరణ జరగనుంది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, మార్చి 26న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ విలన్‌గా దర్శనమివ్వనున్నారు.. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు..అయితే, పెద్ది విడుదల రోజే నేచురల్ స్టార్ నాని – దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన “ది ప్యారడైజ్” కూడా రిలీజ్ కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాల మధ్య ఆసక్తికరమైన క్లాష్ తప్పదనిపిస్తోంది..