కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మాటలు జరుగుతున్నాయని ఫైనల్ కావొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది. వివరాలలోకెళితే సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇద్దరు తమిళ్ లో స్టార్ హీరోలే. ఎవరి స్టైల్ వారిది. ఇద్దరికి భారీగా అభిమానులు ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడి మరి నటించి తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
ఇంతటి బడా స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఆలోచన చేసిన యంగ్ డైరెక్టర్ వీరిద్దరిని కలిసి సినిమా చేయాలనీ భావిస్తున్నాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు తమిళ్ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్. కమల్ కు విక్రమ్ రూపంలో భారీ హిట్ ఇచ్చిన లోకేష్… రీసెంట్ గా రజనితో కూలీతో డైరెక్ట్ చేసాడు. ఇప్పుడు ఈ ఇద్దరిని కలిపి ఓ సినిమా చేయాలని లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇటీవల ఇద్దరినీ కలిసి కథ కూడా వినిపించాడని సమాచారం. ఓ ఇద్దరు ఓల్డ్ ఏజ్ గ్యాంగ్ స్టార్స్ కలిసి మాఫియాను ఎలా శాసించారు అనే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట. 1979 లో వచ్చిన అల్లావుద్దీనుమ్ అల్భూత విలక్కం తర్వాత అంటే 46 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ కలిసి నటించబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేసి కూలీ రిలీజ్ కు ముందు చర్చలు మొదలు పెట్టి ఇప్పుడు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సిన్మాన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తారట.