కొన్ని రూమర్స్ వినగానే ఎగ్జైట్ అయ్యేలా ఉంటాయి. తాజాగా వినిపిస్తున్న ఈ వార్త కూడా అలాంటిదే. రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్లో మళ్లీ సినిమా రాబోతోందని వినిపిస్తోంది. అంతే కాదు, అది రంగస్థలం-2 అని టాక్ మరింత వేడెక్కిస్తోంది.
సుకుమార్ ప్రస్తుతం రంగస్థలం సీక్వెల్ కోసం కథా బేస్ రెడీ చేశాడట.. 2018 లో చరణ్,సమంత జంటగా సుక్కు డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే..ఈ సినిమా అప్పుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.. రికార్డులు క్రియేట్ చేసింది.. ఐతే ఆ సీక్వెల్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది..త్వరలోనే ఆ కథను చరణ్‌కి వినిపించబోతున్నట్లు సమాచారం. చరణ్ ఓకే అంటే వెంటనే ప్రాజెక్ట్‌పై వర్క్ స్టార్ట్ అవుతుంది..
రంగస్థలం సినిమా ఎండ్ కూడా ఓపెన్ ఎండ్‌గా ముగిసింది. ప్రకాశ్ రాజ్ పాత్ర చనిపోవడంతో, చరణ్–సమంత నడుచుకుంటూ వెళ్లిపోతారు. ఆ తర్వాత కథను ముందుకు తీసుకెళ్లడానికి చాలానే స్కోప్ ఉందని ఇండస్ట్రీలో అంటున్నారు.
అదే పాయింట్‌ను సుకుమార్ పట్టుకున్నాడట. పైగా పుష్పకు సీక్వెల్ చేసిన అనుభవం ఉండటంతో, ఈసారి రంగస్థలం-2 కూడా ఖాయం అనే నమ్మకం ఫ్యాన్స్‌లో పెరిగింది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో, త్వరలోనే క్లారిటీ రానుంది.