కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ కలుసుకున్నారు. న్యూఢిల్లీ వెళ్లిన లోకేష్ నిర్మలా సీతారామన్ వద్దకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను తీసుకెళ్లారు. ఊదారంగా ఏపీకి సాయం చేస్తున్నందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పురోగతిని కేంద్రమంత్రికి వివరించిన లోకేష్ రాబోవు కాలంలో ఏపీకి సహకరించాలని కోరారు. ఈమేరకు ఆయన కలుసుకున్న వివరాలను ఆయన సోషల్‌మీడియా ఖాతాల్లో వెల్లడించారు.
