మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ భాను భోగరవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ జాతర షూటింగ్ చివరి దశలో ఉంది. వారం రోజుల షూట్‌తో పాటు కొంత ప్యాచ్‌వర్క్ మాత్రమే మిగిలి ఉంది.
ఈ సినిమా పూర్తి కాకముందే, కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టాడు రవితేజ. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది.
శివ నిర్వాణతో కొత్త ప్రాజెక్ట్
ఈ రెండు సినిమాల తర్వాత మ్యాడ్ స్క్వేర్ దర్శకుడితో సినిమా చేయాల్సి ఉన్న రవితేజ, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. నిన్నుకోరి, మజిలి వంటి హిట్స్ ఇచ్చిన శివ నిర్వాణ, ఇటీవల రవితేజకు థ్రిల్లర్ జానర్‌లో ఒక కథ చెప్పాడట. ఆ పాయింట్ నచ్చడంతో రవితేజ వెంటనే ఓకే చెప్పాడని సమాచారం.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
హిట్ కోసం ఎదురుచూస్తున్న కాంబో
ధమాకా తర్వాత రవితేజకు హిట్ దొరకలేదు. మరోవైపు ఖుషి ప్లాప్ తర్వాత శివ నిర్వాణ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. అందుకే ఈసారి ఇద్దరూ కలిసి పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని పక్కా ప్లాన్ చేస్తున్నారు..