దర్శకుడు మారుతి, మెగా కాంపౌండ్‌కి ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లకు దగ్గరగా ఉండే మారుతి, గతంలో అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్‌లతో సినిమాలు చేశారు.
ఇప్పుడు మళ్లీ అదే కాంపౌండ్‌లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, సాయిధరమ్ తేజ్ హీరోగా కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ అవుతోంది.
ప్రాజెక్ట్‌లో ట్విస్ట్
ఈసారి మారుతి కేవలం దర్శకుడిగా కాకుండా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, మారుతి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా భాగస్వామ్యం కానున్నారు.
ప్రస్తుతం మారుతి తన రాజ్ సాబ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.