Search
Close this search box.

  హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలి

February 4, 2026 2:26 PM | Aditya369 News

హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలి

ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలపై కాకినాడ సుందరయ్య భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ కే సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసుకువచ్చి ట్రాన్స్పోర్ట్ కార్మికుల మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నారన్నారు.రోడ్డుమీద జరిగే ప్రమాదాలకు అసలు కారణాలు పరిశీలించకుండా, ఏళ్ల క్రితం ఉన్నటువంటి రోడ్లనే మరమ్మత్తులు చేస్తున్నారు తప్ప పెరుగుతున్న వాహనాలు జనాభా కి అనుకూలంగా విశాలవంతమైన,గుంతలు గొయ్యలు లేని రోడ్లు వేయకుండా ప్రమాదాలకు కారణం డ్రైవర్లని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఫిట్నెస్ చెకింగ్ ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పి రవాణా రంగ కార్మికులను దోచుకునే విధంగా చేస్తున్నారని తక్షణమే ఫిట్నెస్ చెకింగ్ ప్రభుత్వ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.రవాణారంగ కార్మికులు నిత్యం ప్రమాదాలలో పనిచేస్తూ ఉంటారని అటువంటి కార్మికులకు ప్రభుత్వమే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రవాణా రంగ కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో టాటా మ్యాజిక్ యూనియన్ అధ్యక్షులు వాలిశెట్టి శ్రీను, కార్యదర్శి రమేష్, ఆన్లైన్ ఆటో యూనియన్ నాయకులు విజయ్, బాలు, వినోద్, లక్ష్మణరావు, సతీష్, సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు