రాష్ట్రంలో హిందూ విశ్వాసాలపై కొంత మంది దాడి చేస్తున్నారని పవన్ ఆరోపించారు. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లిన్ చీట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కల్తీనెయ్యి లడ్డూనే అయోధ్య రామమందిరానికి ప్రసాదం కింద తీసుకెళ్లారని ఇది దారుణమన్నారు. భగవంతుడితో పెట్టుకున్న వారు మట్టికొట్టుకుపోతారని పవన్ ధ్వజమెత్తారు.









