Search
Close this search box.

  ‘స్లమ్‌డాగ్’ థియేటర్లలోకా.. ఓటీటీలోకా..? ఫైనల్ ట్విస్ట్ ఇదే..!

May 19, 2026 9:35 AM | Aditya369 News

‘స్లమ్‌డాగ్’ థియేటర్లలోకా.. ఓటీటీలోకా..? ఫైనల్ ట్విస్ట్ ఇదే..!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్లమ్‌డాగ్’ గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ చర్చ నడుస్తోంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన హైప్ చూసి.. ఇది మరో పూరి మార్క్ బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు భావించారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ పూర్తిగా తగ్గిపోవడంతో.. అసలు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా? లేక డైరెక్ట్ ఓటీటీకి వెళ్లిపోతుందా? అనే సందేహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమా అంటే షూటింగ్ మొదలైన దగ్గర నుంచే ఎక్కడ చూసినా హడావుడే కనిపిస్తుంది. కానీ “స్లమ్‌డాగ్” విషయంలో మాత్రం చిత్ర యూనిట్ ఆశ్చర్యకరంగా సైలెంట్ మోడ్‌లో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీజర్ లేదు.. గ్లింప్స్ లేదు.. సాంగ్స్ కూడా లేవు. అయితే దీని వెనుక ఒక స్ట్రాంగ్ బిజినెస్ ప్లాన్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ముందుగా సినిమా థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ మొత్తం క్లోజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. బిజినెస్ పూర్తయ్యాకే ఒక పక్కా స్ట్రాటజీతో వరుసగా టీజర్, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి ఒక్కసారిగా మూవీపై భారీ హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుతం ‘నో అప్‌డేట్.. నో ప్రమోషన్’ అనే ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారట.

ఇక ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందనే వార్తలు కూడా బలంగానే వినిపించాయి. కొన్ని ప్రముఖ ఓటీటీ సంస్థలతో మేకర్స్ చర్చలు జరిపిన మాట నిజమేనని తెలుస్తోంది. అయితే ఆశించిన రేటు రాకపోవడంతో ఇంకా డీల్ ఫైనల్ కాలేదట. ముఖ్యంగా పూరి గత సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారీ మొత్తాలు పెట్టేందుకు వెనుకాడుతున్నాయని సమాచారం.

ప్రస్తుతం మూవీ బిజినెస్ చర్చలు చివరి దశలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకసారి డీల్ లాక్ అయితే.. వెంటనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమాను గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ద్వితీయార్థంలో “స్లమ్‌డాగ్” రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.

అంటే సినిమా ఆగిపోయిందని కాదు.. సరైన బిజినెస్, సరైన టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారన్న మాట. పూరి జగన్నాథ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమా ఉండబోతుందనే అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇక అభిమానులు కూడా అఫీషియల్ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore