Search
Close this search box.

  స్టెల్లా నౌక‌లో మొత్తం బియ్యం త‌నిఖీకి 5 బృందాలు

5 బృందాల‌తో నౌక‌లో మొత్తం బియ్యం త‌నిఖీ
December 4, 2024 7:34 PM | Aditya369 News

స్టెల్లా నౌక‌లో మొత్తం బియ్యం త‌నిఖీకి 5 బృందాలు

కాకినాడ లంగరు రేవులో నిలిపిన స్టెల్లా ఎల్ నౌకలోని కార్గొలో పిడిఎస్ బియ్యం గుర్తించిన నేపద్యంలో నౌకలో ఉన్న మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసేందుకు 5 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో కూడిన ప్రత్యేక తనిఖీ బృందాన్ని నియమించామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు.ఈ బృందంలో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ, పోలీస్, పోర్టు, కస్టమ్స్ శాఖలు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ల నుండి మొత్తం 10 మంది అధికారులను సభ్యులుగా నియమించామని ఆయన తెలిపారు.

రెవెన్యూ శాఖ నుండి పి.వి.వి.గోపాలకృష్ణ, పిఠాపురం తహశిల్దారు, పిఠాపురం, వి.వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్ పెక్టర్, పౌర సరఫరాల శాఖ నుండి యం.విజయ్ కుమార్, డిప్యూటీ తహశిల్దారు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ నుండి టి.సత్యరాజ్, పి.నాగప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్లు, పోలీస్ శాఖ నుండి యం.వి.వి.రవీంద్రనాద్, ఎస్.కే.జానీబాషా సబ్ ఇన్స్ పెక్టర్లు, పోర్టు డిపార్టుమెంటు నుండి ఆఎంవి ప్రసాద్, ఆర్ వెంకటేశ్వరరావు, పోర్టు కన్జర్వేటర్లు, కస్టమ్స్ డిపార్టుమెంటు నుండి పి.శ్రీధర్, సూపరింటెండెంట్ ప్రత్యేక తనిఖీ బృందంలో సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు.

ఈ అధికారుల బృందం స్టెల్లా ఎల్ నౌకలో లోడ్ చేసి ఉన్న మొత్తం బియ్యాన్ని నిబంధనల ప్రకారం తనిఖీ చేసి సమగ్రమైన నివేదిక సమర్పిస్తుందని, ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ నియమించిన 10 మంది అధికారుల ప్రత్యేక తనిఖీ బృందం బుధవారం ఉదయం కాకినాడ లంగరు రేవు అధీనంలో ఉన్న స్టెల్లా ఎల్ నౌకకు చేరుకుని అందులో ఉన్న బియ్యం తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు