కాకినాడ జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం వెనుకబడిన తరగతుల వసతి గృహ 10 వ తరగతి విద్యార్థినిలకు సంఘం కార్యవర్గ సభ్యులు అద్దంకి వెంకన్న బాబు సమకూర్చిన స్టడీ మెటీరియల్, మిగిలిన 160 మంది విద్యార్థులకు పుస్తకాలు,పెన్నులను ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి కామేశ్వర రావు మాస్టారు చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ చక్కగా చదువుకుని మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తేవాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ఫ్లోరెన్స్,రామకృష్ణ,కనకారావు,బాబ్జి, వరుణ్ వర్మ, వీరభద్రరావు,శ్రీనివాస్,అర్జునరావు పాల్గొన్నారు.









