సారా విక్రయ కేసులో సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మాదేవం గ్రామానికి చెందిన పోతురాజు అనే వ్యక్తికి ఏడాది జైలు, రెండు లక్షల జరిమానా విధిస్తూ ప్రోహిబిషన్ అండ్ ఎక్సయిజ్ కేసుల ప్రత్యేక JFCM కోర్టు న్యాయమూర్తి కుమారి ఆనం నాగ మల్లీశ్వరి తీర్పునిచ్చారు. 2021లో 5 లీటర్ల సారాతో నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. సామర్లకోట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుకు సంబంధించి గురువారం తీర్పు వెలువడిందని సామర్లకోట సిఐ కృష్ణభగవాన్ తెలిపారు. అప్పటి ఏఎస్సై మొండి సింహాద్రి కేసు నమోదు చేయగా, ఎస్సై అభిమన్యు ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్ తరుపున ఏపీపీ ఎన్.రాధిక వాదనలు వినిపించారు. కేసు పురోగతికి సహకరించిన కానిస్టేబుల్ దుర్గేష్‌ను, నాటి ఎస్సై, ఏఎస్సైలను కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు.









